ADB: బోథ్ మండలంలోని పిప్పల్ దరి గ్రామస్తులు MP నగేశ్‌ను బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను ఎంపీతో విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని గ్రామస్తులకు ఎంపీ హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు మెస్రం అనసూయ, బండారి స్వామి యువకులు తదితరులున్నారు.