WPLలో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 155 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. లిజెలీ లీ (67), లారా (25*), షెఫాలీ (36), జెమీమా (21)తో రాణించారు. యూపీ బౌలర్లలో దీప్తీ శర్మ 2 వికెట్లు తీసింది. ఢిల్లీకి ఇది తొలి విజయం కావడం విశేషం.