VZM: తెలుగు ప్రజలు గర్వపడే ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లి ఖార్జున్ రావును ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం రాజాంలోని జీఎంఆర్ ఆయన ఐటీ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జీఎంఆర్కు దుశ్శాలువ కప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.