BHPL: ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరగనున్న మినీ మేడారం జాతరకు కమిటీని నియమించారు. జాతర కమిటీ అధ్యక్షుడిగా ఆలూరి గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శిగా చదువు అన్నారెడ్డిని ఎన్నుకున్నారు. మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, ముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేశ్ నేతృత్వంలో కమిటీ ఎన్నుకున్నట్లు కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు తెలిపారు.