AKP: కనుమ పండుగ సందర్భంగా మునగపాకలో ఆవుల అలంకరణ పోటీలను శుక్రవారం నిర్వహించారు. 100కు పైగా ఆవులను అందంగా అలంకరించిన రైతులు పోటీలకు తీసుకువచ్చారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ.. రైతులు పశువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారన్నారు. మొదటి స్థానంలో నిలిచిన ఆవుకు రూ.50,000 నగదు బహుమతి అందజేశారు.