MHBD: ఇనుగుర్తి మండలం లాలుతండా వద్ద శుక్రవారం బైక్ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. అన్నారం దర్గా దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సంగెం శివ (22) అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్, మహేశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు.