AP: లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులతో ఉన్న సంబంధాల గురించి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.