TG: సికింద్రాబాద్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సికింద్రాబాద్ అస్తిత్వానికి ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం సికింద్రాబాద్‌ను ఎందుకు జిల్లా చేయలేదని ప్రశ్నించారు. ఏ నిర్ణయమైనా అందరి అభిప్రాయం మేరకే తీసుకుంటామన్నారు. అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు.