చిత్తూరు 12వ వార్డు రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఏ.వాసుదేవ నాయుడు మృతికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.