JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం సీఎం కప్ 2025 క్రీడాజ్యోతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ సీజన్ 2 టార్చ్ ర్యాలీలో కొడిమ్యాల ఎంపీడీవో, ఎస్సై, ఎంఈవోలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.