PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వినతుల స్వీకరణను మరింత వేగవంతం చేసేందుకు ఇకపై మండల స్థాయిలోనే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాలను సందర్శించి, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, సత్వరం పరిష్కారం చేయనున్నట్లు చెప్పారు.