WPLలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జార్జియా వోల్ (54*), స్మృతి మంధాన (96), రిచా ఘోష్ (7*) రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో మరిజానే, నందని శర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఇది RCBకి వరుసగా నాలుగో విజయం.