ASF: రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా కే. హరితను నియమించింది. ఆసిఫాబాద్ జిల్లాలో పని చేసిన కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హరిత 2013 బ్యాచ్‌కు చెందిన వారు.