ADB: విదేశీ ఉద్యోగం పేరుతో మోసం చేసిన నకిలీ ట్రావెల్ ఏజెంటును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మావల ఎస్సై మధుకృష్ణ ఆదివారం తెలియజేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువకుడి నుండి రూ. 4 లక్షల వసూలు చేసినట్లు వెల్లడించారు. మోసానికి గురైన వారు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.