SKLM: గార మండలం శాలిహుండం శ్వేతగిరిపై వీరవసంతేశ్వరస్వామి ఆలయ సముదాయంలో స్వామివారి వార్షికోత్సవం నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త మహేంద్రాడ రవిశర్మ తెలిపారు. విశేష అర్చన, అభిషేకంతోపాటు హోమాది కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.