TG: సింగరేణి కుంభకోణంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డికి ఈ కుంభకోణంలో వాటాలు అందకపోతే.. ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఈ కుంభకోణాలపై విచారణ చేపిస్తామని.. ఇందులో భాగస్వాములైన అధికారులను కూడా విడిచిపెట్టమని KTR హెచ్చరించారు.