WGL: వంద పడకల ఆసుపత్రి కోసం ఎమ్మెల్యే నాగరాజు రెండు సార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని బీజేపీ జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో విమర్శించారు. ముందుగా కట్ర్యాల గ్రామ శివారులో ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద శంకుస్థాపన చేసిన తర్వాత, ఇప్పుడు వర్ధన్నపేట మండల కేంద్రంలో మళ్లీ శంకుస్థాపన చేయడం ప్రజలను మభ్యపెట్టడమే అని అన్నారు.