BDK: దమ్మపేట రైతు వేదిక లో నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు మండల స్థాయిలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాల మొదటి విడత తరగతులకు నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి మొదటి మెట్టు అని పేర్కొన్నారు.