WGL: జిల్లా దుగ్గొండి (M) లోని స్వామి రావు పల్లె ప్రధాన రహదారి పక్కన గత 7 రోజులుగా మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతున్న అంశాన్ని ఈరోజు ఉదయం HIT TV కథనాన్ని ప్రచురించారు. దీనిపై గ్రామ కార్యదర్శి వైనాల రాజు స్పందించి, లీకేజీని గుర్తించి తక్షణమే మరమ్మత్తు చేస్తున్నట్లు తెలిపారు. HIT TV యాజమాన్యానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.