RR: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు.