సత్యసాయి: కువైట్లో అకాల మరణం చెందిన కదిరి వాసి మౌలాలి పార్థివదేహం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చొరవతో స్వగ్రామానికి చేరింది. మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వం, ఎంబసీ అధికారులతో మాట్లాడి కేవలం రెండు రోజుల్లోనే మృతదేహాన్ని ఇండియాకు తెప్పించారు. కడసారి చూపుకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.