టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా? సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ‘ఏ-ప్లస్’ (A+) కేటగిరీని రద్దు చేయాలని బోర్డు యోచిస్తోందని సమాచారం. టెస్టులు, టీ20లకు వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. రోహిత్, కోహ్లీలను నేరుగా ‘బి’ (B) కేటగిరీకి తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వారి పారితోషికంలో భారీ కోత పడనుంది.