MDK: రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి (FRO) విద్యాసాగర్ ఆధ్వర్యంలో మంగళవారం అక్కన్నపేట బీట్ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. అడవి సంరక్షణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ‘ట్రయల్ పాత్’ (నడక మార్గం) పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.