MLG: మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సరైనది కాదని BRS MLG జిల్లా ఇంచార్జ్ నాగజ్యోతి అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. కేసులో ఎలాంటి వాస్తవాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసి కొట్టివేసినప్పటికీ మళ్లీ నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ కక్షపూరిత దురుద్దేశానికి నిదర్శనమని విమర్శించారు.