ప్రపంచవ్యాప్తంగా అరుదైన వ్యాధులు సుమారు 350 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఒక్క భారతదేశంలోనే 70 మిలియన్ల మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో 80% జన్యుపరమైనవి. కేవలం 5% వ్యాధులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. అది కూడా చాలా ఖరీదైనవి. వీటిని ముందుగా గుర్తిస్తే.. వ్యాధి తీవ్రతను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.