KMM: మధిర మండలం దెందుకూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు 87వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన షుగర్ ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం Dy. CM భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. లండన్, ఇండియా, UKలకు చెందిన 30 మంది వైద్య బృందం స్వయంగా ఇక్కడికి వచ్చి, మధిర నియోజకవర్గ పేదలకు ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం అభినందనీయం అని తెలిపారు.