VSP: బిగ్ బాస్ సీజన్-9 విజేత, విజయనగరం జిల్లా వాసి కళ్యాణ్ పడాల మంగళవారం మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంవీపీకాలనీలో గంటా నివాసంలో భేటీ అయ్యారు. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన మొట్టమొదటి కామనర్‌గా కళ్యాణ్ రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందని గంటా పేర్కొన్నారు.