VKB: పరిగి మండలం జీడిగడ్డ తండాకు చెందిన డేగవత్ శ్రీనివాస్ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్టేట్లో 343వ ర్యాంక్, జోన్లో 15వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 8వ ర్యాంక్, కేటగిరీలో 2వ ర్యాంక్ సాధించారు. కరోనా సమయంలో మొదటిసారి నర్సింగ్ ఆఫీసర్గా, రెండోసారి హెల్త్ సూపర్వైజర్గా ఉద్యోగం పొందిన శ్రీనివాస్, పట్టుదలతో ఏదైనా సాధ్యమని నిరూపించారు.