NZB: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి గురించి ఆలోచించని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే అర్హత లేదన్నారు.