AKP: అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ పురవీధుల్లో అమ్మవారిని వెండి రథంపై మేళతాళాలతో ఊరేగించారు. వాసవి మాత జై నామసంకీర్తనతో కార్యక్రమం సాగింది. అనంతరం మూలవిరాట్టుకు క్షీర, పంచామృత అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ మండపంలో 102 వెండి ప్రమిదలతో దీపారాధన చేశారు.