HYD: ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో భారీ ఫ్లైఓవర్‌కు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే ప్రయాణికులకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కల్పించేలా రూ. 345 కోట్లతో ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ‘హై సిటీ’ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే ఈ పనులకు తాజాగా టెండర్లు ఆహ్వానించారు.