BPT: బాపట్ల చేపల మార్కెట్లో తూకం మోసాలు కలకలం రేపుతున్నాయి. కేజీన్నర చేపలు కొంటే, బయట తూకం వేస్తే కేజీ లోపే వస్తున్నాయని ఓ బాధితుడు వాపోయాడు. వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారు. చేపలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. అధికారులు స్పందించి, మార్కెట్లో తనిఖీలు చేయాలని కోరుతున్నారు.