TG: తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా గురించి అడిగితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే.. తనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడమన్నారు. రెండేళ్లయినా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం సాధించారని ప్రశ్నించారు.