టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తాత, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి అయిన ఈవీవీ వెంకట్రావు కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాత మరణంతో నరేశ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకట్రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.