TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై సిట్ అధికాలులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పాత్ర ఏంటీ?, ఫోన్ ట్యాపింగ్ చేసేలా ఎవరెవరికి డైరెక్షన్ ఇచ్చారు?’ అనే అంశాలపై సిట్ కూపీ లాగుతున్నట్లు సమాచారం. అయితే మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీకి కొన్ని నంబర్లు ఇచ్చి ట్యాప్ చేయించారనే ఆరోపణలు హరీష్ రావుపై ఉన్నాయి.