NLG: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి క్లస్టర్ స్థాయి ‘సీఎం కప్’ క్రీడా పోటీలు మంగళవారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రారంభమయ్యాయి. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి జానకమ్మ, పీఈటీ ఇమామ్ కరీం, తదితరులు పాల్గొన్నారు.