KMM: మధిర పట్టణ అభివృద్ధిలో కేసీఆర్ ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయని, ప్రజల్లో వాటికి మంచి ఆదరణ వచ్చింది. అవే మున్సిపల్ ఎన్నికల్లో BRS కి శ్రీరామరక్ష అని మాజీ జడ్పీ ఛైర్మన్, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లింగాల కమల్ రాజు వెల్లడించారు. మంగళవారం 100 పడకల ఆసుపత్రి వద్ద ఆసుపత్రి ప్రధాత కేసీఆర్ చిత్రపటానికి BRS శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు.