KMM: ఖమ్మం సీపీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్సై వి.రమేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.