WGL: సంగెం మండల పరిధిలోని గవిచర్ల-సంగెం గ్రామాల మధ్య రైతు గుళ్లపల్లి చక్రపాణికి చెందిన వ్యవసాయ బావిలో మంగళవారం 6 అడవి పందులు పడి చిక్కుకున్నాయి. నీటిలో ఈదుతూ బయటకు రాలేకపోతున్న వన్యప్రాణులను గమనించిన రైతు వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.