AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్ మెస్‌కు సిబ్బంది తాళాలు వేశారు. నిన్నటి నుంచి హాస్టల్లో భోజనం పెట్టడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఫీజు చెల్లిస్తేనే మెస్ ఓపెన్ చేస్తామంటున్నారని పేర్కొన్నారు. వర్సిటీ అధికారులు తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఫీజు కడితేనే మెస్ ఓపెన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని క్రూరమైన చర్యగా ప్రకటించారు.