NGKL: వటువర్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వారాల పట్టిక బోర్డును పంచాయతీ సిబ్బంది జేసీబీతో కూల్చివేసి ఉద్రిక్తత రేకెత్తించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముందస్తు సమాచారం లేకుండా బోర్డు తొలగించడాన్ని ఖండించారు. సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాల వల్ల కూలీలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.