యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. భవనం చిన్నపిల్లలకు సౌకర్యాలను అందిస్తుందని, అంగన్వాడీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐలయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయినాల చైతన్య మహేంద్రరెడ్డి, సర్పంచ్ బీర్ల శంకర్, అధికారులు పాల్గొన్నారు.