TG: హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు నోటీసులు ఇచ్చింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను లాయర్ విజయ్ సవాల్ చేశారు. ధరలు పెంపు ఉత్తర్వులను కోర్టు దృష్టికి జీపీ తీసుకురాలేదని పేర్కొన్నారు. ఇకపై టికెట్ ధర పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది.