హనుమకొండ జిల్లా కాజీపేట మండల MROగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చాలమల్ల రాజును మంగళవారం BRS నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MROను శాలువతో ఘనంగా సన్మానించి.. పూల మొక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా BRS సీనియర్ నాయకుడు రాజేందర్, 44వ డివిజన్ BRS అధ్యక్షుడు కోటేశ్వర్, సుధాకర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.