కడప: తువ్వపల్లె గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాత స్థల వివాదమే ఘర్షణకు కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. గాయపడిన వారిని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.