NRPT: ఊట్కూరు మండలంలోని సీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో తపస్ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నేతాజీ ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కుసుమ ప్రశ్నపత్రాలను పంపిణీ చేసి, చిన్నతనంలోనే విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడం అవసరమని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.