AP: ప.గో. జిల్లా పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆత్మార్పణ రోజును కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. వాసవీ పెనుగొండగా ప్రభుత్వం పేరు మార్చి ఆర్యవైశ్యులపై ఉన్న ప్రేమను చాటుకుందన్నారు. త్యాగం, సత్యం, ధర్మానికి ప్రతీకగా నిలిచిన మాతకు నివాళులని పేర్కొన్నారు.