JN: జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026కు సంబంధించిన పోస్టర్‌ను జఫర్గడ్ డెవలప్మెంట్ కమిటీ, దేవాలయాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మంచాల ఎల్లయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాఫర్‌గఢ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.