NZB: జిల్లాలో పురపోరుకు మరో ముందడుగు పడింది. కీలక ఘట్టమైన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలు పోటీకి సమాయత్తమవుతున్నాయి. రిజర్వేషన్ ఆధారంగా ప్రజల్లో పట్టున్న అభ్యర్థులను బరిలో దించడానికి అన్వేషణ ప్రారంభించాయి. ఆర్మూర్, బీమ్గల్ పురపాలికల్లో జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.