ADB: ప్రభుత్వ భూ మాఫియాలను అరికట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండలాధ్యక్షుడు అర్క గోవింద్ రావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం తహసీల్దార్ రాజలింగంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మాన్కపూర్ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్ 94/3, 94/3a లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని పలువురు దళారులు ప్లాట్లుగా అమ్ముతున్నారని ఆరోపించారు.